ఆకుపచ్చ కండువ ఏస్కున్న ఒకాయన సోనియమ్మ తల్లి దయతోనే అంటున్నడు..
పసుపచ్చ అంగి తొడుక్కున్న ఓ పెద్ద మనిషి చంద్రబాబు లేఖతోనే అంటున్నడు..
కాషాయపు జెండ చేతిలో పట్టిన ఒక సారు సుష్మాజీ మాటతోనే అంటున్నడు..
గులాబీ రంగు తిలకం దిద్దిన ఇంకో నాయకుడు మేము పుట్టిందే మీకోసం అంటున్నడు..
నిండైన మనసుతో తెలంగాణ కోసం తెగించి పోరాడిన నిజమైన నాయకులందరికి జై కొడదాం.
వోట్ల కోసమే తెలంగాణాన్ని ఎత్తుకున్నోళ్ళను ఓ కంట కనిపెడదాం.
సగం ముచ్చట ఇంక ముందే ఉన్నది తమ్మీ..
"సాగిపోదలచిన
ఆగరాదిచటెపుడు
ఆగిపోయిన ముందు
సాగనే లేవెపుడు"
అన్న కాళన్న మాటలని యాది జేస్కుంట ముందుకు పోదాం!
మన బతుకుల్లో నిజమైన మార్పు వచ్చేదాక పోరాట పంథాలోనే నడుద్దాం!!