Friday, August 23, 2013

నిజం నీ భాధ్యత!!

పెన్ను, మైకు, కెమెరా..
ఇవి నీకు ఇచ్చింది
నిజాలు రాయడానికి..
నిజాలు వినిపించడానికి..
నిజాలు చూపించడానికి..

అంతే కానీ..
గాలిలో నుండి వార్తలు సృష్టిస్తూ గారడీలు చేయకు
రాజకీయ రంగు పులుముతూ ప్రతి వార్తతో రభస చేయకు
గతి తప్పిన చర్చలతో అందరిని గందరగోళంలోకి నెట్టకు
మితి మీరిన వ్యాఖ్యలతో మనుషులను రెచ్చగొట్టకు
మతి లేని వ్యంగ్యంతో మనసులను గాయపర్చకు
శృతి మించిన సృజనాత్మకతతో వార్తల్లో వినోదాన్ని నింపకు

నీకు చేతనైతే,
చరిత్రలో మరుగునపడ్డ నిజాలని ప్రచురించు.
జనాన్ని చైతన్యవంతులని చేసే నిజాలని వినిపించు.
బతుకులని మార్చే నిజాలని చూపించు.

నీకు నిజాయితీ ఉంటే జనం నుండి పుట్టిన ఉద్యమాలకి నీ వంతు చేయూతనందించు!
పెట్టుబడిదార్ల పెత్తనం కోసం పుడుతున్న ఉద్యమాలను జనంపైకి నెట్టకు!!

1 comment:

Unknown said...

బాగుంది గురూ
వీళ్ళ హడావిడి చూడడం వల్ల లేని పోనీ రోగాలు వస్తున్నాయి జనాలకు. ఈ చర్చలు రచ్చలు ఐదు నిమిషాలకన్నా ఎక్కువ చూడలేక పోతున్నామండీ టీవీని.