లేక దేశం పేరు వినగానే శివాలెత్తి ఊగిపోవడమే దేశభక్తి అనుకుంటున్నావా?
లేక కేవలం పంద్రాగస్టుకి చబ్బీస్ జనవరికి జెండాని ప్రొఫైల్ ఫోటోలా పెట్టుకుని మురిసిపోతున్నావా??
లేక పార్టీల గుర్తులు, జెండాల మాయలో పడి కొట్టుకుపోతున్నావా??
లేక నీ మతమే గొప్పదని బీరాలు పోతున్నావా??
లేక నీ పాత చింతకాయ పచ్చడి భావాల్లోనే మగ్గిపోతున్నావా??
లేక సంస్కృతి సంప్రదాయాల ముసుగులో వ్యక్తి గత స్వేచ్ఛని కాలరాస్తున్నావా??
లేక నా కులం నా మతం నా ప్రాంతం అనే సాకుతో నీకు నచ్చని ప్రతి దానిపై రాధ్ధాంతం చేస్తున్నావా??
లేక ఛాందస భావాలతో మళ్ళీ అవే తప్పులకు పునాదులు వేస్తున్నావా??
లేక పార్టీల ప్రాపగాండా ఉచ్చులో పడి నీ ప్రాథమిక హక్కులనే మరుస్తున్నావా??
లేక నియంతృత్వ పోకడలున్న నేతలనే నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నావా??
లేక నాయకుల మాటల్లోనే వాటి నిర్వచనాలు వెతుక్కుంటున్నావా??
లేక ప్రశ్నించే ప్రతి వాడిని దేశద్రోహి అంటూ రంకెలేస్తున్నావా??
లేక ఇలా మరమనిషిలాగే కాలగర్భంలో కలసిపోతావా??