Thursday, August 30, 2018

ఇప్పటికైనా మేల్కొంటావా??

దేశం అంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని ఎప్పుడైనా విన్నావా??
లేక దేశం పేరు వినగానే శివాలెత్తి ఊగిపోవడమే దేశభక్తి అనుకుంటున్నావా?

దేశం నడుస్తున్న తీరు గమనించే తీరిక చేసుకుంటున్నావా?
లేక కేవలం పంద్రాగస్టుకి చబ్బీస్ జనవరికి జెండాని  ప్రొఫైల్ ఫోటోలా పెట్టుకుని మురిసిపోతున్నావా??

దేశంలోని సిధ్ధాంతాలని భావజాలాన్ని అర్ధం చేసుకుంటున్నావా?
లేక పార్టీల గుర్తులు, జెండాల మాయలో పడి కొట్టుకుపోతున్నావా??

మనిషి గురించి ముందు ఆలోచిస్తున్నావా?
లేక నీ మతమే గొప్పదని బీరాలు పోతున్నావా??

ప్రపంచీకరణ నేర్పిన జ్ఞానాన్ని స్వీకరిస్తున్నావా?
లేక నీ పాత చింతకాయ పచ్చడి భావాల్లోనే మగ్గిపోతున్నావా??

విభిన్న అభిప్రాయాలని గౌరవిస్తున్నావా?
లేక సంస్కృతి సంప్రదాయాల ముసుగులో వ్యక్తి గత స్వేచ్ఛని కాలరాస్తున్నావా??

బతుకు బతకనివ్వు అంటూ భాద్యత గల పౌరుడిగా మసలుతున్నావా?
లేక నా కులం నా మతం నా ప్రాంతం అనే సాకుతో నీకు నచ్చని ప్రతి దానిపై రాధ్ధాంతం చేస్తున్నావా??

చరిత్ర చెప్పిన పాఠాలు నేర్చుకుంటున్నావా?
లేక ఛాందస భావాలతో మళ్ళీ అవే తప్పులకు  పునాదులు వేస్తున్నావా??

పౌరుడిగా నీ హక్కుల కోసం ప్రశ్నిస్తున్నావా?
లేక పార్టీల ప్రాపగాండా ఉచ్చులో పడి నీ ప్రాథమిక హక్కులనే మరుస్తున్నావా??

ప్రజాస్వామ్య విలువల గొప్పదనం తలకెక్కించుకుంటున్నావా?
లేక నియంతృత్వ పోకడలున్న నేతలనే నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నావా??

రాజ్యాంగ విలువలపై అవగాహన తెచ్చుకుంటున్నావా?
లేక నాయకుల మాటల్లోనే వాటి నిర్వచనాలు వెతుక్కుంటున్నావా??

ప్రశ్నించే తత్వం అలవర్చుకుంటున్నావా?
లేక ప్రశ్నించే ప్రతి వాడిని దేశద్రోహి అంటూ రంకెలేస్తున్నావా??

ఇప్పటికైనా మేల్కొంటావా.. మార్పులో భాగమౌతావా?
లేక ఇలా మరమనిషిలాగే కాలగర్భంలో కలసిపోతావా??

1 comment:

Unknown said...

పుస్తక పఠనము అంటే ఏదైన ఒక అంశంతో మనసు కొంత సేపు ఏకాగ్రతతో ప్రయాణం చేయడం! పుస్తకములు చరిత్రను తెలియజేస్తాయి, సామాజిక పరిస్థితులపై అవగాహన ఏర్పరుస్తాయి. గొప్పవారి భావనలను అక్షరరూపంలో కలిగి ఉంటాయి. పుస్తకపఠనం మనకు ఊహా శక్తిని కలుగజేస్తాయి! దర్శించండి తెలుగురీడ్స్.కామ్

https://telugureads.com/vijnanam-telugureads-knowledge-book-reading/