మీరు ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభంలా నిలవాలి కదా..
ప్రజల గొంతుకై పోరాడాలి కదా..
ప్రభుత్వమేదైనా నిజం వైపు నిలబడాలి కదా..
జాతికి దిశా నిర్దేశనం చేయాలి కదా..
ఎంతటి ఘన చరిత మీది..
నిరంకుశ ప్రభుత్వాలు కూలాలన్నా..
సామ్రాజ్యవాదం సమాధి కావాలన్నా..
పెట్టుబడిదారీ వ్యవస్థకి హద్దులు గీయాలన్నా..
అణగారిన వర్గాల హక్కులు కాఫాడాలన్నా..
ప్రజలని సరైన దిశలో నడపాలన్నా..
మీరే కదా మార్పుకి నడుం కట్టింది.
ప్రజల అజ్ఞానాన్ని ప్రారదోలింది.
అభివృద్ధికి బాటలు వేసింది.
దేశాన్ని ముందుకు నడిపింది.
చరిత్రని తిరగరాసేందుకు కదం తొక్కింది.
ఇప్పుడెందుకు మీ తీరు ఇంతలా మారింది?
ప్రజలు ఏవగించుకునేంతగా గతి తప్పింది?
ఎంతో పరిణతితో వ్యవహరించాల్సిన విషయాల్లో వినోదాన్ని వెతుకుతున్నారెందుకు?
ఎంతో హుందాగా వ్యవహరించాల్సిన విషయాల్లో సిగ్గులేకుండా బరితెగిస్తున్నారెందుకు?
ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు మొహం చాటేస్తున్నారెందుకు?
మత చాంధసవాదాన్ని నిలదీసే గొంతుల్ని నొక్కేస్తున్నారెందుకు?
ప్రశ్నించే ప్రతి పౌరుడిని దేశద్రోహి అని ముద్ర వేస్తున్నారెందుకు?
పనికి రాని విషయాలపై అనవసర రాధ్ధాంతం చేస్తున్నారెందుకు?
దేశభక్తిని తూకం వేస్తున్నారెందుకు?
ప్రజల మధ్య వైషమ్యాల్ని పెంచుతున్నారెందుకు?
విచారణ జరగకముందే దోషుల్ని నిర్ణయిస్తున్నారెందుకు?
ద్వంద్వ ప్రమాణాలతో ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారెందుకు?
వార్తల్ని వార్తల్లా చూపకుండా అక్కరకురాని చెత్తతో కలిపి వండి వడ్డిస్తున్నారెందుకు?
ఏమైపొయింది మీ జవాబుదారీతనం?
ఎక్కడికిపోయింది మీ ప్రశ్నించేతత్వం?
ఎందుకు చచ్చిపోయింది మీలో సామాజిక చైతన్యం?
ఎప్పుడు ఆవిరైపోయింది మీలో నిజమైన పాత్రికేయ రక్తం?
ఇప్పటికైనా నిజం వైపు నిలబడతారా?
ప్రజలకి బాసటగా నిలుస్తారా?
పాత్రికేయ విలువల్ని బతికిస్తారా?
లేక చరిత్ర హీనులుగా మిగిలిపోతారా?
(పాత్రికేయ విలువల్ని కాలరాస్తున్న కొన్ని పాత్రికేయ సంస్థల్ని కొందరు పాత్రికేయుల్ని ఉద్దేశించి)

No comments:
Post a Comment