ఎన్నికలప్పుడు అరచేతిలో స్వర్గం చూపించి
గెలిచాక మొహం కూడా చూపించని
నాయకులని ఏనాడైనా కనీసం నిలదీశావా?
గెలిచాక మొహం కూడా చూపించని
నాయకులని ఏనాడైనా కనీసం నిలదీశావా?
బాధ్యతగా చేయాల్సిన పనులని కూడా
ధనాపేక్షతో జాప్యం చేస్తూ పీడించే
లంచగొండి అధికారులని ఏనాడైనా కనీసం గట్టిగా ప్రశ్నించావా?
ప్రజల కనీస ఆరోగ్య అవసరాలు తీర్చలేకపోతున్న
ప్రభుత్వ విధానాలపై ఏనాడైనా గొంతెత్తావా?
ఇవన్నీ చేయలేని చేతకాని నువ్వు
తమ ప్రాణాలు ప్రమాదం ముంగిట నిలిచినా కూడా
నిబ్బరంగా శక్తికి మించి సేవలందిస్తున్న
వైద్యులపై మాత్రం చెయ్యెత్తుతావా?
ఎందుకీ కండ కావరం?
ఎప్పుడు తగ్గుతుంది నీ పైత్యం?
ఒకటి మాత్రం సత్యం!
నీ నిర్లక్ష్యంతోనో నిస్సహాయతతోనో
నీ ప్రాణం మీదకు తెచ్చుకున్నప్పుడు
ఆ వైద్యుడి చెయ్యే నీకు ఆపన్న హస్తం!
ఇప్పటికైనా నువ్వు గ్రహించకుంటే ఈ నిజం..
నీ మెదడు కి పట్టిన వైరస్ ని నయం చేయలేదు ఏ వైద్యం!!
No comments:
Post a Comment